Gautham's

Posts

Tags

About

Resume

Aadamarapedo

Poetry Telugu

Stan 1

ఆదమరపేదో కమ్మిందో యేమో మరి,

కంట పడలేదు ఇన్నాళ్ళు ఈ సుందరి,

వేళ కానీ వేళల్లో ఈ అల్లరి,

రేపి యెటు మాయమయ్యేనో యేమో మరి…

Stan 2

నిన్ను చూసాకిలా నాకు అనిపించెనే,

అందం అంటే నీ మోమంటు చూపాలనే…

కలువ పువ్వుల్నే కన్నుల్లో నింపేవులే,

రేయిలో రజనినే కురులలో దాచేవులే…

Stan 3

నాలో ఇన్నళ్ళుగా, నాకు ఇన్నేళ్ళుగా,

జరగనీవింతలే, ఇపుడే జరిగేనులే…

అడుగు నీవైపే పడునంటు కదిలేనులే,

కనులే నిన్ను చూడగా మాటలాడేనులే…


Wanna reach out? Email me!

Copyright (c) 2021 Sai Gautam Kolluru