Bride & Groom
ప:
అలనాటి సీతారాముల కళ్యణమే,
అనిపించే పండుగ జరిగెను మన మధ్యనే… (2)
ఈ వేడుకే వీక్షించే తరుణముకై భువికేగి,
దేవతలే బంధువులై నట్టింట్లొ నిలిచేలే…
ఆ సీతరాములే మళ్ళీ మనకోసమే,
వీరిరువురి రూపముదాల్చేరనిపించెలే…
చ1:
ఆ సూర్య చంద్రులనే తన చూపుల్లొనింపి,
ఆ వెన్నెల నవ్వులతో అడుగిడెనే శ్రావణుడే,
ఏ ఒదిదుడుకే ఐన ఆ అడుగుకి దిగదుడుపే,
ఏ ఒదిదుడుకే ఐన దిగదుడుపే…
ఆ బ్రహ్మ విష్ను శివులే ఒకటయ్యినట్టు ఉండే,
ఈ వరుడు వొడికి రాగా,
ఆ మండపాన అణువు అణువు మురిశెలే…
చ2:
వాగ్దెవి వైవిధ్యం తన గాత్రంలో నింపి,
శ్రీ విష్నువునే వలచిన మా లక్ష్మే గాయత్రి,
సహనాన అవనిజనే తలపించేనీ మఘువే,
సహనాన అవనిజనే తలపించే…
ఇటువంటి వధువే తరలీ మా వరుడి జంటకాగా,
ఆ సంబరాన జనులా,
ఆనందాలే అంబరాలకెగశెలే…