Stan 1:

నీ కన్నుల్లో చూశా నన్నే,

నా కలలే నీతో నిండేనే…

నీ నవ్వుల్లో దొరికే నా తీరమే,

నే అలనై నిన్నే చేరానే…

నేనే ఇక నీ వశం,

ఆంక్ష వో కాంక్ష వో ఏమో…

తెలుపే మనసా, ఏమైందో బహుశ?

Stan 2:

ఈ క్షణమీ వీక్షణమే అనుక్షణమూ కోరేనే,

వీక్షణకై నిరీక్షణలే క్షణమైన యుగమేలే…

నీ జతనే గెలవాలన్నది, ఆదేశమేలే…

ఈనాడే నను వీడేలా,

మాయేదో చెశావే…

తెలుపే మనసా, ఏమైందో బహుశ?